వర్షాకాలంలో విటమిన్ D లోపం రాకుండా ఉండాలంటే ఇవి తినండి

Published by: Geddam Vijaya Madhuri

సాల్మన్, సార్డిన్, మాకరెల్ వంటి చేపలు విటమిన్ Dకు మంచి సహజ వనరులు. వీటిని వారానికి 2–3 సార్లు తీసుకుంటే మంచిది.

గుడ్డు పచ్చసొనలో విటమిన్ D ఉంటుంది. వీటిని రోజూ లేదా వారంలో కొన్ని రోజులు గుడ్లు తింటే బెటర్.

కొన్ని పాలు, పెరుగు, ప్లాంట్-బేస్డ్ మిల్క్‌లలో విటమిన్ Dను అదనంగా కలుపుతారు. కొనుగోలు చేసే ముందు లేబుల్‌ చెక్ చేసి తీసుకోండి.

మష్రూమ్స్‌లో విటమిన్ D కొంతమేర ఉంటుంది. శాఖాహారులకు ఇవి మంచి ఎంపిక.

కొన్ని ఓట్స్, సెరెల్స్‌లో విటమిన్ Dను కలుపుతారు. వాటిని పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకుంటే పోషక విలువ పెరుగుతుంది.

మేఘాలు ఉన్నా కూడా కొంతమేర UV కిరణాలు ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఉదయం లేదా మధ్యాహ్నం కొద్దిసేపు బయట ఉండండి.

విటమిన్ D కాల్షియం శోషణకు అవసరం. అందుకే పాలు, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను కూడా డైట్‌లో చేర్చండి.

చేపలు, గుడ్లు, పప్పులు, శనగలు, చికెన్ వంటి ప్రోటీన్ ఆహారాలు ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

తరచూ అలసట, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, తరచూ అనారోగ్యం వంటి లక్షణాలు ఉంటే విటమిన్ D లోపం కావచ్చు.

విటమిన్ D సప్లిమెంట్లు వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.