రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరుగా చెప్పవచ్చు.

మద్యంపై విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ఆదాయం వస్తుంది.

అలా ఏ ప్రభుత్వం ఆల్కహాల్ నుంచి ఎక్కువ సంపాదిస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తుంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం ద్వారా 41,250 కోట్లు వసూలు చేసింది.

ఉత్తర ప్రదేశ్ తర్వాత కర్ణాటక ప్రభుత్వం మద్యం ద్వారా ఎక్కువగా సంపాదిస్తోంది.

20,950 కోట్లు ఎక్సైజ్ సుంకం ద్వారా ఆదాయాన్ని సేకరించి కర్ణాటక రెండో ప్లేస్​లో ఉంది.

కర్ణాటక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా సంపాదిస్తుంది.

15,343.08 కోట్ల ఆదాయాన్ని వసూలు మూడో స్థానంలో నిలిచింది మహారాష్ట్ర.

తెలుగు రాష్ట్రాలు టాప్ 3 ప్లేస్​ను సంపాదించుకోలేకపోయాయి.