అద్దం అందగా ఉండాలంటే తప్పకుండా దుమ్మూధూళీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

చేతి వేలి ముద్రలు, దుమ్మూధూళిని సులభంగా శుభ్రపరిచేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.

తరచుగా తడిగుడ్డతో తుడుస్తూ ఉంటే అద్దం మసకబారిపోతుంది.

న్యూస్ పేపర్ తడి చేసి అద్దాన్ని తుడిస్తే అద్దం మీద నీటి మరకలు కాకుండా శుభ్రపడుతుంది.

అద్దం మీద టాల్కం పౌడర్ చల్లి తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే మరకలు పోయి మెరుస్తుంది.

టీస్పూన్ టూత్ పేస్ట్ కు అర టీస్పూన్ నీళ్లు కలిపి దాన్ని అద్దానికి రాసి పొడి వస్త్రంతో తుడిస్తే అద్దం శుభ్రమవుతుంది.

బేకింగ్ సోడా వెనిగర్ కలిపి పేస్ట్ లా తయరుచేసి అద్దానికి రాసి పదినిమిషాలు వదిలేసి మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి.

వైట్ వెనిగర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి అద్దం మీద స్ప్రే చేసి 2,3 నిమిషాల తర్వాత శుభ్రమైన మెత్తని క్లాత్ తో తుడవాలి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే