గాఢమైన నిద్రను అందించే టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

నిద్ర సమస్యలు

మారుతున్న జీవనశైలి ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్లు వల్ల రాత్రి నిద్రను దూరం చేస్తాయి.

Image Source: pexels

అంతరాయం

దీనివల్ల నిద్ర సమస్యలు పెరిగి.. కొందరు నిద్రలో తరచుగా మేల్కొంటారు. నిద్రలోకి జారుకున్న తర్వాత కూడా నిద్రకు అంతరాయం కలుగుతుంది.

Image Source: pexels

నిద్రను మెరుగుపరచుకోండిలా

నిద్రపోయే ముందు కొన్ని రెగ్యులర్ స్లీపింగ్ టిప్స్ పాటించడం వల్ల నిద్ర నాణ్యతను బాగా మెరుగుపరుస్తుంది.

Image Source: Canva

నిద్రవేళ ఉండాల్సిందే

ప్రతి రాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల శరీరం సర్దుబాటు అవుతుంది. దీనివల్ల సహజంగా నిద్రపోవడం, మేల్కొనడం ఈజీ అవుతుంది.

Image Source: Canva

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి

మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేందుకు నిద్రపోయే ముందు కనీసం 90 నిమిషాల పాటు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించకపోవడమే మంచిది.

Image Source: pexels

స్క్రీన్​కు దూరంగా ఉండడి

నిద్రపోయే ముందు స్క్రీన్ లైట్​కి దూరంగా ఉండాలి. దీనివల్ల శరీరంలో మెలటోనిన్​ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు హెల్ప్ చేస్తుంది.

Image Source: pexels

స్నానం చేయండి

పడుకునే ముందు వేడి నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో అలసట తగ్గుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. నిద్రకు మీరు పర్​ఫెక్ట్​గా సిద్ధమవుతారు.

Image Source: pexels

గోరు వెచ్చని పాలు తాగండి

వెచ్చని పాలు మీ శరీరంలో మెలటోనిన్ స్థాయిలను సహజంగా పెంచుతాయి. ఇది ప్రశాంతమైన మనస్సు, గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది.

Image Source: Canva

ప్రశాంతమైన నిద్ర వాతావరణం ఉండాలి

నిద్రపోయే ముందు గది ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత ఉందా.. లేదా.. తక్కువ వెలుతురు ఉందా అని చూసుకోవాలి. ఇది నిద్రకు కీలకం.

Image Source: pexels