సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయితే బావుంటుంది అనిపిస్తుంది.

అయితే భోజనం తర్వాత మనం చేసే పనుల మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందట.

భోంచేశాక వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు. నిద్రకు ఉపక్రమిస్తే శరీరం విశ్రాంతి స్థితి కి చేరుతుంది. జీర్ణక్రియకు అంతరాయం జరుగుతుంది.

త్వరగా పడుకోవాలనుకుంటే తక్కువ ఆహారం తీసుకోవడం, లేదా తిన్న తర్వాత కొద్ది పాటి వాకింగ్ వంటివి చేస్తే మంచిది.

పొగతాగడం ఎప్పుడూ హానికరమే. కానీ భోజనం తర్వాత తాగే ఒక్క సిగరెట్ పది సిగరెట్ల నష్టం కలిగిస్తుంది.

కడుపునిండా తిన్నాక వెంటనే స్నానం చెయ్యవద్దు. స్నానం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరిగి జీర్ణవ్యవస్థకు ప్రసరణ తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

భోజనం తర్వాత వెంటనే పండ్లు తినొద్దు. వీటి జీర్ణక్రియా విధానం వేరుగా ఉంటుంది కనుక పోషకాల శోషణ సజావుగా ఉండదు.

భోజనం తర్వాత టీ, కాఫీలు తీసుకోవద్దు. వీటిలో ఉండే ఆసిడ్లు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు ఐరన్ శోషణ జరగదు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే