మంచి షాంపూలు, కండిషనర్లు వాడినప్పటికీ జుట్టు బలంగా పెరగడం లేదా?

అయితే ఈ గింజలు రోజువారి ఆహారంలో భాగం చేసుకుని చూడండి తప్పకుండా ఫలితం ఉంటుంది.

షీయా సీడ్స్ లో ఫ్యాటీ ఆసిడ్లు, ప్రొటీన్, ఫైబర్. జింక్ కాపర్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు తెగిపోవడాన్ని నివారిస్తాయి.

అవిసెగింజల్లో ఒమెగా3ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. అవిసెగింజలు జుట్టు కుదుళ్లు, స్కాల్ప్ ఆరోగ్యానికి మేలుచేస్తాయి.

అవిసెగింజల్లోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు పలుచబడకుండా నివారిస్తాయి.

నువ్వులు తెల్లవైనా, నల్లవైనా సరే వాటిలో మెగ్నీషియం, కాల్షియం, ప్రొటీన్ ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు అవసరం.

నువ్వుల్లోని పోషకాలు స్కాల్స్ ను హైడ్రేట్ చేస్తాయి. సూర్యరశ్మి వల్ల జుట్టుకు నష్టం జరగకుండా నివారిస్తాయి.

పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ E, జింక్, ఒమెగా3ఫ్యాటీఆసిడ్లు ఉంటాయి. ఇవి మాడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.

వీటిని స్నాక్స్ గా తీసుకోవచ్చు. కానీ 30 గ్రాములకు మించి తినకూడదు.

మెంతుల్లో ఉండే ప్రొటీన్ తో పాటు, నికొటిక్ ఆసిడ్ కంటెంట్ జుట్టును బలంగా చేసి తెగిపోకుండా కాపాడుతాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.