భూమి మీద ఒక్కో ప్రదేశంలో ఒక్కో వాతావరణం కలిగి ఉంటుంది. కొన్నిచోట్ల విపరీతమైన ఎండ ఉంటే.. కొన్ని చోట్ల చాలా చల్లగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చలి ప్రదేశాలేంటో ఒకసారి చూద్దాం. అంటార్కిటికా ఖండం భూమి మీద అత్యంత చల్లటి ప్రదేశం. -89.2డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. వోస్టాక్ స్టేషన్. సౌత్ పోల్ లో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్లడం కష్టం. ఇక్కడ దాదాపు -84డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. తూర్పు అంటార్కిటికా లో ఉండే ఐస్ డోమ్ లో దాదాపు -83 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటార్కిటికాలో ఎత్తైన ఐస్ డోమ్.. డోమ్ ఆర్గస్. శాటిలైట్ డేటా ప్రకారం అక్కడ -92డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మనుషులు నివసించ గల అత్యంత చల్లని ప్రదేశం ఓయ్ మయాకన్. రష్యాలో ఉంది ఈ ప్రదేశం. రష్యాలోని మరో ప్రదేశం వెర్కొయాన్స్క్. ఇక్కడ దాదాపు -67.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. గ్రీన్ లాండ్ లోని నార్త ఐస్. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత చలి ప్రదేశాల్లో ఒకటి.