బ్లడ్ షుగర్, బరువు పెంచే ఫుడ్స్ ఇవే.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

వైట్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్‌ను వేగంగా పెంచుతుంది.

వైట్ బ్రెడ్, మైదాతో కూడిన ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్ బ్లడ్ షుగర్‌ను త్వరగా పెంచుతాయి.

సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ జ్యూసులు ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెంచి బరువు కూడా పెరిగేలా చేస్తాయి.

స్వీట్స్, డెజర్ట్స్ చక్కెర అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్, బరువు పెరుగుతాయి.

పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. ఇవి బరువు పెరుగుదలకు దారి తీస్తాయి.

చిప్స్, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్ స్నాక్స్లో షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం.

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ కొలెస్ట్రాల్ పెంచి బరువు పెరగడానికి కారణం అవుతాయి.

ప్రాసెస్డ్ మీట్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది.

కాఫీ, టీలు ఎక్కువ షుగర్ వేసుకుని తీసుకుంటే కూడా షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

ఆల్కహాల్ కూడా బ్లడ్ షుగర్‌ను అస్థిరంగా చేసి బరువు పెరుగుదలకు దారి తీస్తుంది.