దానిమ్మ తొక్కలతో టీ.. తాగితే ఈ ఆరోగ్య సమస్యలు దూరం

Published by: Geddam Vijaya Madhuri

దానిమ్మ తొక్కలు పడేయకుండా నీటిలో మరిగించి.. టీలా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

దానిమ్మ తొక్కల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గ్యాస్, అజీర్ణం, బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెటాబాలిజం పెంచి కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గిస్తుంది.

దీనిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు ఇన్‌ఫెక్షన్స్ తగ్గించడంలో ఉపయోగపడతాయి.

చర్మాన్ని క్లీన్‌గా ఉంచి పింపుల్స్, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది.

డయేరియా తగ్గిస్తుంది. పేగు సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది.

దంతాల ఆరోగ్యానికి మంచిది. బ్యాక్టీరియాను తగ్గించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.