రాత్రి ఇవి తినండి, తాగండి.. హాయిగా బజ్జోండి!

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? అయితే, మీ ఆహార నియమాలను ఇలా మార్చుకోండి.

చాలా ఆహారాలు, పానీయాల్లో మంచి నిద్రను ఇచ్చే కాంపౌండ్స్ ఉంటాయి.

బాదం పప్పులు: వీటిలో నిద్రకు అవసరమైన మెలాటోనిన్ ఉంటాయి.

వాల్ నట్స్: వీటిలోని మెలాటోనిన్, సెరోటోనిన్, మెగ్నీషియం నిద్రకు ఉపకరిస్తాయి.

కివీ ఫ్రూట్: నిద్రకు ఒక గంట ముందు కివీ ఫ్రూట్ తినాలట.

కనీసం ఒక 4 వారాలు కివీ ఫ్రూట్ తింటే నిద్ర సమస్యలన్నీ తీరిపోతాయట.

గోరువెచ్చని పాలు: మంచి నిద్రకు అవసరమైన కాంపౌడ్స్ పాలులో ఉన్నాయి.

పాలలో ఉండే ట్రైప్టోఫన్, కాల్షియం, విటమిన్ డి, మెలాటోనిన్ నిద్రకు సహకరిస్తాయి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు తీసుకోండి.