టేస్టీ హెల్తీ మెంతి పరాఠా.. సింపుల్ రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

పరాటాలు చాలామంది ఇష్టంగా తింటారు.

Image Source: freepix

వాటిలో మెంతి పరాటాలు కూడా ఒకటి. దాని రెసిపీ కూడా సింపుల్.

Image Source: freepik

మెంతి పరాటాలు చేయడానికి తాజాగా ఉన్న మెంతి ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి.. గోధుమ పిండిలో వేసి బాగా కలపండి.

Image Source: freepix

తర్వాత పెరుగు వేసి కలపండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం, జీలకర్ర పొడి, వాము, అల్లం పేస్ట్, ఉప్పు వేసి కలపండి.

Image Source: freepik

ఇప్పుడు కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని కలుపుకోవాలి.

Image Source: freepik

ఆ తరువాత పిండిలో నూనె కూడా కలపండి. అప్పుడు పరాటాలు మెత్తగా, క్రిస్పీగా వస్తాయి.

Image Source: freepik

ఇప్పుడు పిండిని తడిసిన కాటన్ గుడ్డతో కప్పి 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి.

Image Source: freepix

ఆ తరువాత మళ్ళీ పిండిని తీసుకుని కలిపి ఉండలు చేసుకోవాలి.

Image Source: freepik

ఆ తరువాత ఒక పాన్ లేదా తవ్వాని మీడియం మంట మీద ఉంచి.. పరాటా వేసి రెండువైపులా కాల్చుకోవాలి.

Image Source: freepix