సమ్మర్లో పెరుగన్నం ఇలా తింటే చాలా మంచిది వేసవిలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తేలికగా జీర్ణమయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. అలా తేలికగా జీర్ణమయ్యే ఫుడ్స్‌లో పెరుగన్నం ఒకటి. టేస్టీగా, హెల్తీగా, త్వరగా జీర్ణమయ్యే పెరుగున్నం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రెండు కప్పుల అన్నంలో ఒకటిన్నర కప్పుల పెరుగు వేసుకోవాలి. దానిలో అర టేబుల్ స్పూన్ అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, సాల్ట్ వేసి కలుపుకోవాలి. కడాయి పెట్టుకుని దానిలో నూనె వేసి.. దానిలో ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి తాళింపు వేసుకోవాలి. దానిలో క్యారెట్ తురుము వేసి మగ్గనిచ్చి.. కొత్తిమీర వేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగున్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ, హెల్తీ పెరుగన్నం రెడీ. పిల్లలకు ఇది రెగ్యూలర్‌గా పెడితే మంచిది. (Images Source : envato)