వాల్​నట్స్ ఆరోగ్యానికి చాలామంచిది. అయితే వీటిని వింటర్​లో తింటే కలిగే ప్రయోజనాలివే.

ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి.

వీటిలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ చలిని తగ్గించి శరీరంలో వేడిని పెంచుతాయి. శక్తిని అందిస్తాయి.

ఇది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. మతిమరపును దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

చలికాలంలో చాలామందికి కీళ్లనొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిలోని ఇన్​ఫ్లమేషన్లు వాటిని దూరం చేస్తాయి.

వింటర్​లో స్కిన్, హెయిర్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాల్​నట్స్ చర్మానికి, జుట్టుకు చాలా మేలు చేస్తాయి.

రాత్రుళ్లు వాల్​నట్స్​ను నానబెట్టి.. ఉదయాన్నే తీసుకుంటే మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది.

ఓట్​మీల్, యోగర్ట్, స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. న్యూట్రిషియన్లు మీ శరీరానికి అందుతాయి.

రోజుకు 50 గ్రాములు వాల్​నట్స్ తీసుకుంటే సరిపోతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Freepik)