అప్పుడప్పుడు జ్వరం.. ఆరోగ్యానికి మంచిదేనట!

అప్పుడప్పుడు జ్వరం రావడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

జ్వరం రావడం వల్ల తెల్లరక్త కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధకశక్తి మరింత బలోపేతం అవుతుంది.

జ్వరం రావడం వల్ల బాడీలో ఇన్‌ఫ్ల్యూయెంజా వైరస్‌ లాంటి సూక్ష్మజీవులు అభివృద్ధి నిరోధించబడుతుంది.

జ్వరం కారణంగా యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ కణాలు పెరిగి వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

జ్వరంతో బాడీ హీట్ పెరిగి సూక్ష్మజీవుల దాడిలో ధ్వంసం అయిన కణాలు మళ్లీ రిపేర్ అవుతాయి.

జ్వరం కారణంగా చెమట ఎక్కువగా వచ్చి బాడీలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

అప్పుడప్పుడు జ్వరం రావడం వల్ల ఏ సూక్ష్మక్రిమికి ఎలా ఎదుర్కోవాలో ఇమ్యూనిటీ వ్యవస్థకు తెలుస్తుంది.

మరోసారి ఆ వ్యాధులు సోకితే సులభంగా ఎదుర్కొనే శక్తిని రోగనిరోధక వ్యవస్థ పొందుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com