డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. అందుకే వీటిని అందరూ ఇష్టంగా తింటారు.

అయితే వీటిని నేరుగా కాకుండా రాత్రుళ్లు నానబెట్టుకుని తింటే ఆరోగ్యానకిి ఇంకా మంచిదట.

మరి ఏయే డ్రై ఫ్రూట్స్ నానబెట్టితింటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూసేద్దాం.

అంజీర్ కూడా నానబెట్టి తినడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుందట.

ఎండుద్రాక్షలు నానబెట్టి తింటే ఎముకలు బలంగా మారుతాయి. బలహీనత తగ్గుతుంది.

బాదం పప్పులు నానబెట్టుకుని తింటే జీర్ణక్రియ బలపడుతుంది. మెదడు సామర్థ్యం పెరుగుతుంది.

వాల్నట్స్ నానబెట్టి తింటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచివి.

పల్లీలు నానబెట్టి ఉదయాన్నే తింటే గుండె బలపడుతుంది. శక్తి పెరుగుతుంది.

ఈ డ్రై ఫ్రూట్స్ నేరుగా తిన్నా మంచివే కానీ.. నానబెట్టి తింటే మరింత మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలతో వీటిని డైట్లో చేర్చుకోవాలి.