రాత్రుళ్లు నిద్రమాని మొబైల్ వాడితే కలిగే నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

ఫోన్ల ఆధిపత్యం

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. పని నుంచి వినోదం వరకు.. స్క్రీన్​పై ఎక్కువ ఆధారపడిపోతున్నాము.

Image Source: Canva

రాత్రంతా స్క్రోలింగ్

సోషల్ మీడియా, గేమ్స్, రీల్స్, మెసేజింగ్​లలో ప్రజలు చాలా సేపు టైమ్ వేస్ట్ చేస్తారు. చాలా మందికి ఈ స్క్రీన్ సమయం అర్ధరాత్రి దాకా కొనసాగుతుంది. ఇది ఎంత హానికరమో తెలుసా?

Image Source: Canva

మెదడుకు ఏమవుతుందంటే..

అనేకమంది రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల.. నిద్ర కోల్పోతారు. దాని కంటే కూడా ఎక్కువ ప్రభావాలు చూపిస్తుంది. ఇది మీ మెదడు, మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Image Source: Canva

మెలటోనిన్ స్థాయిల్లో మార్పులు

మొబైల్ స్క్రీన్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ను తగ్గిస్తుంది. ఇది రాత్రి సమయంలో శరీరం సహజంగా విశ్రాంతి తీసుకోవడం కష్టతరం చేస్తుంది.

Image Source: pexels

మెదడుపై భారం

నడిరాత్రి సమయంలో కూడా నీలి కాంతికి గురైతే మెదడు మేల్కొని ఉండమని సంకేతాలిస్తుంది. ఇది మీ శరీర గడియారాన్ని గందరగోళానికి గురిచేస్తుంది. సహజ నిద్ర విధానాన్ని దెబ్బతీస్తుంది.

Image Source: Canva

నిద్రలో ఇబ్బందులు

రాత్రి ఆలస్యంగా నిరంతరం స్క్రోలింగ్ చేయడం వల్ల మనస్సు అధికంగా ఉత్తేజితమవుతుంది. ఫలితంగా చాలా మంది త్వరగా నిద్రపోవడానికి కష్టపడుతున్నారు. దీనివల్ల గంటల తరబడి అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

Image Source: pexels

జ్ఞాపకశక్తిపై ప్రభావం

సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల మానసిక సామర్థ్యాలు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. రోజంతా మెదడు మందగిస్తుంది.

Image Source: pexels

డిస్టర్బ్ చేసే నోటిఫికేషన్లు

అలెర్ట్స్, సందేశాలు, సోషల్ మీడియా అప్డేట్లు మెదడును నిరంతరం చురుకుగా ఉంచుతాయి. ఇది మానసిక విశ్రాంతిని నిరోధిస్తుంది. నిజమైన విశ్రాంతిని దూరం చేస్తుంది.

Image Source: pexels

ఎనర్జీ ఉండదు

రాత్రి బాగా పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్ వాడటం మెదడును అలసిపోయేలా చేస్తుంది. దీనివల్ల పగటిపూట అలసట, తక్కువ ఉత్పాదకత, శక్తి లేకుండా డ్రైన్ చేస్తాయి.

Image Source: pexels