నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగితే వచ్చే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

తేనె, నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఎంజైమ్‌లు శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.

Image Source: paxels

అది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందని.. చాలామంది రెగ్యులర్​గా దీనిని తీసుకుంటారు.

Image Source: paxels

కొంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ ఇది సెట్ అవ్వకపోవచ్చు.

Image Source: paxels

నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎవరికి ప్రమాదకరమో తెలుసుకుందాం.

Image Source: paxels

ఎసిడిటీ సమస్య ఉన్నవారికి వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల ఆమ్లత్వం మరింత పెరిగే అవకాశం ఉంది.

Image Source: paxels

నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆమ్లాన్ని పెంచుతుంది.

Image Source: paxels

నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్య పెరిగే అవకాశం ఉంది.

Image Source: paxels

నిమ్మకాయలో ఉండే ఆమ్లం పుండ్లను పెంచుతుంది. దీనివల్ల ఇబ్బంది పెరిగే ప్రమాదం ఉంది.

Image Source: paxels

అంతేకాకుండా తేనె స్వభావం వేడిగా ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది.

Image Source: paxels