ప్లాస్టిక్‌ బాటిల్స్ లో వాటర్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త!

ఈ రోజుల్లో చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లలో వాటర్ తాగుతున్నారు.

ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిళ్లనే క్యారీ చేస్తున్నారు.

లేదంటే దుకాణాలలో మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు.

అయితే, ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

కంటికి కనిపించని ప్లాస్టిక్‌ రేణువులు కడుపులోకి వెళ్లి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయంటున్నారు.

నానో ప్లాస్టిక్‌ కణాల కారణంగా పేగులు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

గుండె, మెదడు సహా పలు అవయవాలు వ్యాధులకు గురవుతాయని హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ మానేసి కాపర్, స్టీల్ బాటిళ్లు వాడటం మంచిదంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: pexels.com