రవ్వ పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, బియ్యం రవ్వ.. ఇలా చాలా రవ్వలను వంటలకు ఉపయోగిస్తారు. అయితే వీటిని ఎక్కువ తెచ్చి స్టోర్ చేసుకుంటే అవి పురుగులు పడుతుంటాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రవ్వ ఏది అయినా దానిని లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానిని చల్లార్చి స్టోర్ చేసుకోవచ్చు. దాల్చినచెక్కను, రవ్వను పాన్‌లో వేసి కూడా డ్రై రోస్ట్ చేసి.. చల్లారక స్టోర్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులను రవ్వలో వేసి వాటిని ఓ సీసాలో ఉంచి స్టోర్ చేయవచ్చు. ఎయిర్‌టైట్ కంటైనర్ ఉపయోగిస్తే రవ్వ ఫ్రెష్‌గా పురుగులు లేకుండా ఉంటుంది. రవ్వను ఫ్రిజ్‌లో ఉంచితే పురుగులు పట్టవు. ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంటాయి. మీరు స్టోర్ చేసే సీసా లేదా డబ్బాలో తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. (Images Source : Envato)