ఎక్కువమంది స్వీట్స్ చాలా ఇష్టంగా తింటారు. స్వీట్లు మొదలుకొని సాంప్రదాయ వంటల వరకు చాలామంది వీటిని రోజూ తింటారు.
కొంతమంది ఉదయాన్నే స్వీట్స్ తింటారు. మరికొందరు పడుకునే ముందు తినేందుకు ఎక్కువ ఇష్టపడతారు.
తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి అలసట, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఈ దుష్ప్రభావాలను నివారించడానికి స్వీట్స్ తినేందుకు సరైన సమయం ఉండాలి అంటున్నారు నిపుణులు. ఆ సమయం ఎప్పుడో చూసేద్దాం.
నిపుణులు స్వీట్లు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్న భోజనం తర్వాత అని చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు మీ శరీరం చక్కెరను నిర్వహించడానికి బాగా సిద్ధంగా ఉంటుంది.
మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే కాకుండా.. దాదాపు ఒక గంట తర్వాత స్వీట్ తీసుకోవచ్చు.
మధ్యాహ్నం స్వీట్లు తినడం వల్ల రోజంతా కేలరీలను బర్న్ చేయడానికి మీ శరీరానికి తగినంత సమయం దొరుకుతుంది.
ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. శక్తి స్థాయిలకు ఆటంకం కలుగుతుంది.
తీపి పదార్థాల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు వంటి పోషకాలు తక్కువగా ఉండి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.