వేసవిలో ఎండలు ఒకవైపు, ఆ ఎండలకు బాడీలో పెరిగే టెంపరేచర్ మరోవైపు ఇబ్బంది పెడతాయి.

మామూలుగా 37 డిగ్రీలు మానవ శరీర ఉష్ణోగ్రత, వేడి చేసే వారిలో ఇది ఒకటి లేదా అర పాయింట్ ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉంటారు.

వేడి చేస్తే... కళ్లలో ఆవిరి, మూత్రం వెచ్చగా రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్లు, మల బద్దకం వంటి లక్షణాలు ఉంటాయి.

జన్యు కారణాలు అంటే కుటుంబంలో ఎవరికైనా ఇలా వేడి శరీరాలు ఉంటే వారికి రావచ్చు.

కొందరిలో పచ్చళ్లు, మసాలాలు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల వస్తుంది.

వేసవిలో కొన్ని జాగ్రత్తలతో ఈ బాధల నుంచి విముక్తి పొందవచ్చు.

వేసవిలో వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

చల్లగా ఉండే సాఫ్ట్ డ్రింక్ లు తీసుకోవద్దు. వీలైనంత వరకు రూమ్ టెంపరేచర్ లో ఉండే పదార్థాలు తీసుకోవాలి.

రోజుకు కనీసం 4.5 లీటర్ల నీళ్లు తాగాలి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే