బ్లాక్ కాఫీలో చాలా పోషకాలు ఉంటాయి. పాల కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన.

బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ ఆసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.

మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. కాఫీలో కెఫిన్ వల్ల మెదడు కొద్దిగా స్టిమ్యూలేట్ అవుతుంది. చురుకుగా ఏకాగ్రతతో పనిచేసుకోవచ్చు,

అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.

లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మోతాదులో బ్లాక్ కాఫీ తాగితే సిర్రోసిస్, క్యాన్సర్, ఫ్యాటీ లివర్ వంటి జబ్బులను నివారించవచ్చు.

జీవక్రియలు వేగవంతం అవుతాయి. కెఫిన్ వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

టైప్2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే