గర్భధారణ సమయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో అత్యంత అందమైన, సున్నితమైన దశలలో ఒకటి.
ఈ సమయంలో తల్లి శరీరంలో అనేక శారీరక మార్పులు జరుగుతాయి. అప్పుడే వారిలో ఒక కొత్త జీవితం పెరగడం ప్రారంభిస్తుంది.
ఈ సమయంలో చిన్న అలవాట్లే తల్లి, పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
సురక్షితమైన గర్భం కోసం.. గర్భిణులు 6 ముఖ్యమైన విషయాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.
ధూమపానం లేదా పొగాకు తీసుకునే అలవాటు ఉంటే మానేయండి. ఇది పిండం పెరుగుదల, మొత్తం అభివృద్ధిపై తీవ్రంగా హాని కలిగిస్తుంది.
గర్భిణులు మునగకాయను తీసుకోకూడదు. ఎందుకంటే దాని వేడి స్వభావం గర్భధారణ సమయంలో ఇబ్బందులు ఇస్తుంది.
టీ, కాఫీ, శీతల పానీయాలలోని కెఫిన్.. శిశువు నిద్ర విధానం, అభివృద్ధిపై ప్రభావితం చూపిస్తుంది.
గర్భధారణ సమయంలో మద్యం సేవించడం చాలా ప్రమాదకరం. ఇది పిల్లల మానసిక అభివృద్ధిపై ఆటంకం కలిగిస్తుంది.
పచ్చి మాంసం, గుడ్లు లేదా సరిగ్గా ఉడికించని సీఫుడ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ అధిక నూనె, మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.