ప్రసవం తర్వాత ఎన్ని రోజులకి పీరియడ్స్ వస్తాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

పిల్లలు తల్లి పాలు మానేసి.. ఘన ఆహారం తీసుకోవడం ప్రారంభించే వరకు నెలసరి రాదు.

Image Source: pixabay

పాలు ఇవ్వని మహిళలకు డెలివరీ అయిన 6 నుంచి 8 వారాలలోపు నెలసరి తిరిగి ప్రారంభం కావచ్చు.

Image Source: pixabay

మీరు తల్లి పాలు, ఫార్ములా రెండింటినీ కలిపి ఇస్తుంటే.. పీరియడ్స్ 2 నుంచి 3 నెలల్లో తిరిగి రావచ్చు.

Image Source: pixabay

ప్రసవం జరిగిన వెంటనే అయ్యే రక్తస్రావం పీరియడ్స్ కాదు. ఇది 4 నుంచి 6 వారాల వరకు ఉండవచ్చు. కాలక్రమేణా నెమ్మదిగా తగ్గుతుంది.

Image Source: pixabay

శిశువు పుట్టిన తర్వాత మొదటి నెలసరి ఎక్కువగా లేదా క్రమరహితంగా ఉండవచ్చు. ఎందుకంటే శరీరం హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది.

Image Source: pixabay

కొంతమంది మహిళలకు మొదట్లో తక్కువ లేదా ఎక్కువ తీవ్రమైన తిమ్మిరి (కడుపు నొప్పి) ఉండవచ్చు. ఇది సాధారణమేనని గుర్తించాలి.

Image Source: pixabay

గర్భధారణ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల పీరియడ్స్ రావడం ఆగిపోతాయి.

Image Source: pixabay

కొంతమంది మహిళలకు తల్లిపాలు ఇస్తున్నా.. డెలివరీ అయిన 4 నుంచి 6 వారాలలోనే పీరియడ్స్ మళ్ళీ మొదలవుతాయి.

Image Source: pixabay

ఆరు నెలల తర్వాత కూడా మీకు పీరియడ్స్ తిరిగి రాకపోతే లేదా మీకు చాలా ఎక్కువ రక్తస్రావం అయితే వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pixabay