ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే.. అవి తినే ఆహారం మీద అటాక్ చేస్తూ ఉంటాయి.

అయితే ఎలుకలు ఎంగిలి చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రమాదమని చెప్తున్నారు.

ఎలుకలు ముట్టిన ఆహారం తింటే దాని యూరిన్ ద్వారా బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్లు వస్తాయి.

జ్వరం, వాంతులు, కండరాల్లో నొప్పు, కొన్ని తీవ్రమైన కేసుల్లో లివర్, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి.

ఎలుక మొహం ద్వారా ఇన్​ఫెక్షన్ ఫుడ్​లోపలికి వెళ్లి డయేరియా, జ్వరం, కడుపు నొప్పి సమస్యలు కలిగిస్తుంది.

ఎలుక యూరిన్ ద్వారా హాంటా వైరస్ ఆహారంలోకి వెళ్తుంది. దీనివల్ల తీవ్రమైన శ్వాస కోశ సమస్యలు వస్తాయి.

Rat-Bite Fever ఎలుక కరిస్తేనే కాదు.. ఎలుక ఎంగిలి చేసిన ఆహారం తీసుకోవడం వల్ల కూడా వస్తుంది.

ఫుడ్ పాయిజిన్ అవుతుంది. ఎలుకవల్ల ఫుడ్​లో బ్యాక్టీరియా, జెర్మ్స్ ఎక్కువ అవుతాయి.

కాబట్టి ఇంట్లో ఎలుకలు ఉన్నప్పుడు ఆహారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

అలాగే ఎలుక ఆహారం ముట్టుకుందనిపిస్తే వెంటనే దానిని పడేయాలి.

ఇది కేవలం అవగాహన కోసమే.