యూపీఐ గైడ్​లైన్స్.. ఆగస్ట్ 1 నుంచి ఈ మార్పులు తప్పవు

యూపీఐ సర్వర్స్ క్రాష్ అవ్వడం, ఆలస్యం కావడంపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టింది.

దీనిలో భాగంగా యూపీఐ వినియోగంపై కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. దానికి తగ్గట్లు యాప్ ఆటోమేటిక్​గా అప్​డేట్ అవుతుంది.

యూపీఐలో బ్యాలెన్స్​ను రోజులో 50 సార్లు మాత్రమే చెక్ చేసుకోగలుగుతారు.

యూపీఐతో లింక్ అయిన అకౌంట్స్​ 25 మాత్రమే ఉండాలి. సర్వర్​పై ప్రెజర్ తగ్గిస్తుందట.

ఆటోమేటిక్​ పే అనేది ఉదయం పదిలోపు, సాయంత్రం 1 నుంచి 5 గంటల మధ్యలో.. రాత్రి 9.30 మాత్రమే అవుతాయట.

పెండింగ్, ఫెయిల్ పేమెంట్స్ మూడుసార్లు చెక్ చేయవచ్చు. అయితే 90 సెకన్లు గ్యాప్ తీసుకుని స్టేటస్ చెక్ చేయాల్సి ఉంటుంది.

మీరు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వారి పేరు నేరుగా కనిపిస్తుంది. ఇది ఫ్రాడ్ సమస్యలను దూరం చేస్తుంది.

ఇండియాలో యూపీఐ వినియోగం బాగా పెరిగింది. డిజిటల్ క్యాష్​లో భాగంగా చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారు.

నెలకు 18 బిలియన్ల మంది యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారట.

మరికొందరు యూపీఐ చెల్లింపులకు ఇకపై ఛార్జ్ చేస్తారంటూ వినిపిస్తున్నాయి.