ట్రావెల్ చేసే సమయంలో ఈ వస్తువులను తప్పనిసరిగా మీతో తీసుకెళ్లండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రయాణం చేయడం, యాత్రలకు వెళ్లడం జీవితంలో ఒక అందమైన అనుభవం.

Image Source: pexels

సాధారణంగా మనం ప్రయాణం కోసం మొదట బట్టలు, టిక్కెట్లపై ఎక్కువ దృష్టి పెడతాము

Image Source: pexels

కానీ మీ జర్నీలో పెద్ద సమస్యగా మారే అనేక చిన్న చిన్న విషయాలను కొందరు ప్రతిసారి మర్చిపోతారు

Image Source: pexels

మీ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగడానికి మీ వెంట తీసుకెళ్లవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇవే

Image Source: pexels

గుర్తింపు కార్డులు, టిక్కెట్లు, హోటల్ బుకింగ్ కాపీ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు మీ వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

Image Source: pexels

క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు కొంచెం మొత్తంలో నగదు మీతో ఉంచుకోండి. ప్రతిచోటా డిజిటల్ చెల్లింపులు జరగవు

Image Source: pexels

ఫోన్ బ్యాటరీ అయిపోవడం మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. కనుక మీ వెంట పవర్ బ్యాంక్ ఉంచుకోండి.

Image Source: pexels

బ్యాండ్ ఎయిడ్, నొప్పి నివారణ మందులు, వాంతులు తగ్గేందుకు అవసరమైన మందులను ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి.

Image Source: pexels

వాతావరణానికి తగినట్లుగా దుస్తులు తీసుకెళ్లకపోతే ఇబ్బందులు తప్పవు. చల్లని ప్రాంతాలలో జాకెట్లు, వేడి ప్రాంతాలలో తేలికపాటి దుస్తులు తీసుకెళ్లాలి

Image Source: pexels