మునగాకుతో పరాఠా.. టేస్టీ, హెల్తీ రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మొగ్గు చూపుతున్న ఈరోజుల్లో మునగ బాగా ప్రాచుర్యం పొందింది.

Image Source: pixabay

మునగ పోషకాలతో నిండి.. శరీరానికి చాలా బెనిఫిట్స్ ఇస్తోంది. అందుకే దీనితో పరాఠాలు తయారు చేసి తినవచ్చు.

Image Source: pixabay

మునగ ఆకు పరాటా తయారు చేయడానికి.. తాజా మునగ ఆకులను కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Image Source: pixabay

గోధుమ పిండిలో తరిగిన ఆకులు, శనగపిండి, అల్లం, పచ్చిమిరపకాయలు, వాము, పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొద్దిగా నెయ్యి కలపండి.

Image Source: pixabay

పిండిని చపాతీల కోసం చాలా మృదువుగా నీటిని వేస్తూ కలుపుకోవాలి.

Image Source: pixabay

మెత్తటి పిండిని 15 నిమిషాలు క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి.

Image Source: pixabay

10-15 నిమిషాల తర్వాత.. చపాతీలుగా ఒత్తుకోవాలి.

Image Source: pixabay

మధ్యస్థ మంట మీద నెయ్యి లేదా నూనెతో తవా మీద బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

Image Source: pixabay

ఇప్పుడు వేడి పరాఠా రెడీ. దీనిని పెరుగు లేదా పచ్చడితో తినవచ్చు.

Image Source: pixabay