నుదుటి కుడి వైపున మచ్చ ఉంటే అది కీర్తి, ప్రతిష్టలను తెచ్చిపెడుతుందని చెప్తారు.



నుదుటిపై మచ్చ ఉండటం వల్ల వ్యక్తి ధనవంతుడు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



రెండు కనుబొమ్మల మధ్య మచ్చ ఉండటం వల్ల ఎక్కువ ప్రయాణాలు చేస్తారు.



కుడి కంటిపై పుట్టుమచ్చ ఉంటే జీవిత భాగస్వామిపై ప్రేమ ఎక్కువగా ఉంటుందట.



ఎడమ కంటిపై మచ్చ ఉండటం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందట.



కుడి చెంపపై మచ్చ ఉంటే ధనం, సంపదకు మంచి సంకేతంగా చెప్తారు.



ఎడమ చెంపపై మచ్చ ఉంటే కారణం లేకుండా ఖర్చులు పెడతారట.



గడ్డం మీద మచ్చ ఉంటే జీవిత భాగస్వామి ప్రేమలో లోపం ఉండటాన్ని సూచిస్తుంది.



చెవి మీద మచ్చ అంటే ఆయుష్షు మధ్యస్థంగా ఉంటుందని మచ్చ శాస్త్రం చెప్తుంది.