పనసకాయతో ఊరగాయ ఎలా చేస్తారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

చాలా మంది ఊరగాయలను ఇష్టంగా తింటారు.

Image Source: social media

అమ్మమ్మలు, నానమ్మలు, గృహిణులు అందరూ మార్కెట్లలో కొనే బదులు ఇంట్లోనే పచ్చళ్లు చేస్తారు.

Image Source: social media

ఈ ఊరగాయలు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా పరిశుభ్రంగా, సురక్షితంగా కూడా ఉంటాయి.

Image Source: social media

దీనిని తయారు చేయడానికి మొదట పనసను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Image Source: freepik

ఇప్పుడు దీనిని ఉప్పు, 1 టీస్పూన్ పసుపు పొడి వేసి నీటిలో ఉడకబెట్టండి. తరువాత నీటితో చల్లార్చాలి.

Image Source: freepik

అనంతరం ఆవాలు, సోంపు, మెంతులు వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత ఈ మసాలా దినుసులను బరకగా రుబ్బుకోవాలి.

Image Source: freepik

ఆ తరువాత ఆవాల నూనెను వేడి చేయండి. కాస్త పొగ వచ్చే వరకు చేసి తరువాత కొంచెం చల్లార్చండి.

Image Source: freepik

ఆ నూనెలో గ్రైండ్ చేసిన మసాలా దినుసులు, పసుపు , కారం, నల్ల జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి.. తరువాత వెనిగర్ వేసి మసాలాలో కలపాలి.

Image Source: freepik

పనస ముక్కలను తయారుచేసిన మసాలాలో వేసి బాగా కలపండి. అంతే పనస ఊరగాయ రెడీ.

Image Source: social media