నీళ్లు మరీ ఎక్కువ తాగినా ప్ర‌మాద‌మే!

నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మంచిది కదా అని నీళ్లు మరీ తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

అతిగా నీళ్లు తాగితే కిడ్నీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది.

ఎక్కువ నీరు వడపోయలేకపోవడం వల్ల నేరుగా రక్తంలో కలిసే అవకాశం ఉంది.

రక్తంలోని సోడియం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి.

సోడియం తగ్గడం వల్ల నీరు కణాల్లోకి చేరి ఉబ్బి రక్తపోటు పెరుగుతుంది.

మోతాదుకు మించి నీళ్లు తాగితే గుండె సంబంధ సమస్యలు వస్తాయి.

మెదడుపై ప్రభావం పడి తల తిరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

ఒక్కోసారి మూర్చ, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. All photos Credit: Pixabay.com