ఆలివ్ ఆయిల్​ని వంటతో తీసుకోవాలా? లేదా నేరుగా తీసుకుంటే మంచిదా?

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అయితే దీనిని వంటతో తీసుకోవాలా? లేదా నేరుగా తీసుకోవాలా?

ఎక్స్​ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్​లో స్మోక్ పాయింట్ తక్కువగా ఉంటుంది.

కాబట్టి లైట్​గా వేయించుకోవడానికి నేరుగా సలాడ్ డ్రెస్సింగ్​లకు ఉత్తమంగా చెప్తారు.

ఆలివ్ నూనెలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కాస్త వేడి చేసినా అవి దానిలో అలాగే ఉంటాయి.

అయితే ఎక్కువగా వేడిచేస్తే ఆలివ్ ఆయిల్​లోని సహజమైన పోషకాలు తగ్గిపోతాయి.

రోజూ ఖాళీ కడుపుతో 1 లేదా 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు.

ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది.

ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తుంది. కాబట్టి సలాడ్స్​లో నేరుగా కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మరసంతో కలిపి ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది.