మోతాదుకు మించి టీ తాగితే ఇన్ని సమస్యలా?

చాలా మందికి పొద్దున్నే వేడి వేడి టీతో రోజును ప్రారంభిస్తారు.

గరమ్ చాయ్ గొంతులోకి దిగితే మనసు ఉత్సాహంగా మారుతుంది.

కానీ, టీ మోతాదుకు మించి తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

టీ ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది.

టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది.

టీలోని నేచురల్ కెఫిన్ నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది.

టీ ఎక్కువగా తాగితే జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

టీ ఎక్కువగా తీసుకుంటే కళ్లు, తల తిరిగే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com