రాగి పాత్రలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదేనా?

రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తారు.

కానీ, కాపర్ పాత్రలను ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయట.

శరీరంలో కాపర్ స్థాయి పెరిగితే కాపర్ టాక్సిసిటీకి కారణమయ్యే అవకాశం ఉంటుంది.

కాపర్ టాక్సిసిటీ కారణంగా కాలేయ కణాలు దెబ్బతిని, కాలేయ సమస్యలు ఏర్పడుతాయి.

కాపర్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల పేగు సంబంధ సమస్యలు ఏర్పడుతాయి.

శరీరంలో కాపర్ స్థాయి పెరిగినప్పుడు వికారం, వాంతలు, విరేచనాలు కలుగుతాయి.

చర్మం పాలిపోవడం, రక్తహీనత, రోగ నిరోధక శక్తి తగ్గుదల ఏర్పడుతుంది.

పరిస్థితి అలాగే కొనసాగితే లివర్, కిడ్నీ, నాడీ సంబంధ సమస్యలు కలుగుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com