Image Source: pexels

టొమాటోలు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందా?

టొమాటోల్లో లైకోపీన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే టొమాటోలు ఫొలేట్, విటమిన్ ఏ,బి,సి,ఈ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలతో వండినప్పుడు టమోటోలోని లైకోపీన్ పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.

లైకోపీన్, టమోటోలను ఎర్రగా మారుస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

కొన్ని అధ్యయనాలు లైకోపీన్ ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి.

కణాలను దెబ్బతినకుండా కాపాడటంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొటాషియం, సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం, రక్తపోటును తగ్గిస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే టమోటా రసం లేదా చెర్రీ టమాటోలను చిరుతిండిగా తీసుకోవచ్చు.

Image Source: pexels

పోషకాల కోసం టమోటాలను కూరల్లో కానీ, చట్నీగా కానీ, సాస్ ల రూపంలో తీసుకోవచ్చు.