పరాక్రమ దివస్ నేతాజీ స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో బోస్ అసమాన ధైర్యం, నాయకత్వ స్ఫూర్తిని ఆయన జయంతి గుర్తు చేస్తుంది.
సుభాష్ చంద్రబోస్‌ని నేతాజీ అంటారు. దీని అర్థం 'గౌరవనీయుడైన నాయకుడు'. సుభాష్ చంద్రబోస్ యూరప్‌లో ఉన్నప్పుడు బెర్లిన్ లోని భారతీయ, జర్మన్ అధికారులు ఈ బిరుదును ఇచ్చారు. కాలక్రమేణా ఈ పేరు ఆయన ధైర్యమైన నాయకత్వం, శాశ్వత ప్రభావాన్ని సూచిస్తుంది. నేతాజీ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
సుభాష్ చంద్రబోస్ చిన్నతనం నుంచే అసాధారణ విద్యార్థి. అతను తన విద్యా సంవత్సరాల్లో ఎల్లప్పుడూ అత్యుత్తమ విద్యార్థులలో ఒకడిగా నిలిచాడు. 1918లో తత్వశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ డిగ్రీని పొందాడు. అతని విప్లవాత్మక ఉత్సాహానికి మేధోపరమైన ప్రతిభ కూడా ఉందని నిరూపించాడు.
ఆందోళనలకు అతీతంగా, బోస్ ప్రజా పరిపాలన, పత్రికారంగంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఫార్వర్డ్ అనే వార్తాపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. స్వరాజ్ను ప్రారంభించారు. అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. బెంగాల్ రాష్ట్ర కార్యదర్శిగా, కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ CEO గా పనిచేశారు. ఆ తరువాత 1924లో కలకత్తా మేయర్ అయ్యారు.
సుభాష్ చంద్రబోస్ మరింత దూకుడుగా స్వాతంత్య్రం పొందాలని అనుకున్నారు. ఇది మహాత్మా గాంధీతో సైద్ధాంతిక విభేదాలకు దారితీసింది. ఈ విభేదం చివరికి 1939లో బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి దారితీసింది. ఇది భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక మలుపు.
1921 నుంచి 1941 మధ్యకాలంలో బోస్ అనేకసార్లు జైలుకు వెళ్లాడు. 1941లో అతను కోల్కతాలో గృహ నిర్బంధం నుంచి నాటకీయంగా తప్పించుకుని గోమో, పెషావర్, కాబూల్, చివరకు జర్మనీలకు వెళ్ళాడు. అక్కడ అతను భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి అంతర్జాతీయ మద్దతు కోరాడు.
సుభాష్ చంద్రబోస్ ఆస్ట్రియా జాతీయురాలు ఎమిలీ షెంక్ల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అనితా బోస్ పాఫ్ అనే కుమార్తె ఉంది. ఆమె తరువాత గౌరవనీయమైన జర్మన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఖండాంతరాలలో నేతాజీ వారసత్వాన్ని సజీవంగా ఉంచారు.
జై హింద్ అనే దేశభక్తి నినాదాన్ని నేతాజీ రూపొందించారు. ఇది ఇప్పుడు జాతీయ శుభాకాంక్షగా మారింది. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జన గణ మనను తన జాతీయ గీతంగా ఎంచుకున్నారు. ఇది భారతదేశం పట్ల ఆయనకున్న లోతైన సాంస్కృతిక దృష్టికి నిదర్శనం.
1921 నుంచి 1941 వరకు సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ పాలన నుంచి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తూ వివిధ జైళ్లలో పదకొండుసార్లు జైలుకు వెళ్లాడు. అతనిని చేసే అరెస్టులు అతని సంకల్పాన్ని మరింత బలపరిచాయి. భారతదేశపు ధైర్యవంతులైన విప్లవకారులలో ఒకరిగా అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి.