భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫిట్ నెస్ కోసం ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో తెలుసా? భారత్ కు పతకం ఖాయం అనుకున్నవేళ రెజ్లర్ వినేష్ ఫోగట్ డిస్ క్వాలిఫై అయ్యింది. నిర్ణీత బరువు కంటే ఎక్కువగా ఉందనే కారణంతో ఐఓఏ అనర్హత వేటు వేసింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయంతో యావత్ భారత్ దిగ్భ్రాంతికి గురైంది. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా వినేష్ ఘనత సాధించినా, మెడల్ అందుకోలేకపోయింది. ఫిట్ నెస్ కోసం విశేష్ ఫోగట్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యేదో ఇప్పుడు తెలుసుకుందాం.. వినేష్ హర్యానా సంప్రదాయ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇంట్లో తయారు చేసిన ఖీర్, కూర్మా, పొటాటో పరోటాలు, పప్పు, కూరగాయలు తీసుకుంటుంది. కాంపిటీషన్స్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినా సొంతంగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో పాల పదార్థాలు, ఆలు పరోటా, దేశీ నెయ్యి తీసుకుంటుంది. చిరు ధాన్యాలు, ఆకుకూరలతో కూడిన భోజనం చేస్తుంది. ఆ తర్వాత పెరుగు, జున్ను తీసుకుంటుంది. ప్రతి రోజూ పరిమిత స్థాయిలో బాదం, వాల్ నట్స్, జీడిపప్పులు తీసుకుంటుంది. All Photos Credit: Vinesh Phogat/X