విటమిన్ బి12 లోపాన్ని సప్లిమెంట్లు లేకుండా ఇలా తగ్గించుకోండి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

విటమిన్ బి12 ఎందుకు అవసరం?

విటమిన్ బి12 రక్తం, నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శక్తి స్థాయిలకు అవసరం. ముఖ్యమైన శరీర విధులకు ఇది మద్దతు ఇస్తుంది.

Image Source: pexels

DNAను నిర్మించడంలో

విటమిన్ బి12 అన్ని కణాలలో జన్యు కోడ్ అయిన DNAను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఇది లేకపోతే మీ శరీరం.. కణాలను సమర్థవంతంగా పునరుత్పత్తి చేయలేకపోతుంది. దీని వలన అలసట, బలహీనత ఏర్పడుతుంది.

Image Source: pexels

B12 లోపం ప్రమాదాలు

విటమిన్ బి12 తక్కువ స్థాయిలో ఉండటం వల్ల అలసట, జ్ఞాపకశక్తి సమస్యలు, తిమ్మిరి, మానసిక స్థితిలో మార్పులు, చికిత్స చేయకపోతే దీర్ఘకాలిక నరాల నష్టం కూడా కలుగుతుంది.

Image Source: pexels

విటమిన్ బి12 లోపానికి సహజ నివారణులు

నేరుగా సప్లిమెంట్లకు వెళ్లకుండా కొన్ని ఆహారాలు, ఇంటి చిట్కాలతో సహజంగా విటమిన్ బి12 స్థాయిలను పెంచుకోవచ్చు.

Image Source: pexels

హెల్తీ ఫుడ్

సమతుల్య ఆహారం సహజంగానే విటమిన్ బి12ను పెంచుతుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడంపై దృష్టి పెట్టండి.

Image Source: pexels

పాల ఉత్పత్తులు

ఆహారంలో పాలు, పెరుగు, పనీర్, చీజ్ చేర్చుకోవాలి. ఈ పాల ఉత్పత్తులు B12 లో పుష్కలంగా ఉంటాయి. సహజంగా బి12 స్థాయిలను పెంచుతాయి.

Image Source: pexels

బీట్​రూట్​

బీట్​రూట్​ రక్తాన్ని క్లీన్ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. B12 అధికంగా లేనప్పటికీ.. ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. మొత్తం శక్తిని పెంచుతుంది. బి12 లోపం నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

పాలకూర, పుట్టగొడుగులు

పాలకూర, పుట్టగొడుగులు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. B12 అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకున్నప్పుడు మీ శరీరం B12 ని బాగా తీసుకుంటుంది. వాటిని సలాడ్లు, సూప్ లేదా వేయించిన కూరల్లో కలిపి తీసుకోవచ్చు.

Image Source: pexels

తృణధాన్యాలు

మీరు శాఖాహారులు లేదా వీగన్ అయితే.. విటమిన్ B12 కలిగిన మొక్కల ఆధారిత పాలు, తృణధాన్యాలు, పోషకాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది.

Image Source: Pinterest/nutriciously