ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్ పాటించండి!

ఎసిడిటీతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

ఎసిడిటీ ఉన్నవారు ఆహారం జీర్ణంకాక కడుపుబ్బరంతో ఇబ్బంది పడతారు.

కడుపు, ఛాతిలో మంట తీవ్రంగా వేధిస్తుంది.

కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.

పరగడుపున కొన్ని పుదీనా ఆకులు నమిలితే ఎసిడిటీ తగ్గుతుంది.

భోజనానికి ముందుకు తులసి ఆకులు నమిలినా ఎసిడిటీ తగ్గుతుంది.

భోజనం తర్వాత నీళ్లో కాస్త పుదీనా రసం కలిపి తాగినా ఎసిడిటీ తగ్గుతుంది.

భోజనం తర్వాత అరగంటకు కొబ్బరి నీళ్లు తాగితే ఎసిడిటీ మాయం అవుతుంది.