నాన్ వెజ్ బాగా లాగించేస్తున్నారా? అయితే, మీకు ముప్పుతప్పదు!

ఈ రోజుల్లో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు.

మాంసాహారం హెల్త్ కు మంచిదే అయినా, ఎక్కువ తింటే ఇబ్బందులు తప్పవు.

నాన్ వెజ్ ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బరువు పెరుగుతారు.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

మాంసంలోని అధిక కొవ్వు అజీర్ణం, మలబద్దకానికి కారణం అవుతుంది.

మాంసాహారం ఎక్కువ తింటే పేగుల పనితీరు దెబ్బతిని పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

మాంసాహారం ఎక్కువగా తీసుకునే పురుషులలో లైంగిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మోతాదుకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com