ఐస్ వాటర్ ఫేషియల్ చేస్తే ఎన్ని బెనిఫిట్సో చర్మాన్ని బిగుతుగా చేసి.. నిగారింపును అందివ్వడంలో ఐస్ వాటర్ ఫేషియల్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. స్కిన్ హెల్తీగా ఉండేలా చేస్తుంది. మరి ఈ ఐస్ వాటర్ ఫేషియల్ ఏవిధంగా చేయాలో తెలుసా? ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకోండి. దానిలో ఐస్‌క్యూబ్స్ వేయండి. ఐస్ క్యూబ్స్ బౌల్లో అంతా ఫుల్ అయ్యేలా నీటిని వేసి దానిలో ముఖాన్ని ఉంచండి. 5 సెకన్లుకు ఓ సారి బయటకు తీస్తూ.. 5 నుంచి 7 నిమిషాలు చేయండి. ఇలా చేసిన తర్వాత మృదువైన టవల్‌తో ముఖాన్ని డాబ్ చేయండి. అనంతరం మంచి ఫలితాల కోసం ఫేస్ మసాజ్ చేయండి. (Images Source : envato)