మీరు తినేది కోడి గుడ్డా? బాతు గుడ్డా?

Published by: Khagesh

మార్కెట్లో అమ్మేవన్నీ కోడి గుడ్లు కావు. చాలా చోట్ల బాతు గుడ్లు కూడా అమ్ముతారు

మీరు కొనేది బాతు గుడ్డా? కోడి గుడ్డా? అనేది చూడగానే గుర్తించడం కష్టం.

ఈ రెండూ చూడటానికి ఒకేలా కనిపించినప్పటికీ, పరిమాణం, పెంకు, పచ్చసొనలో తేడాలు ఉంటాయి.

సులభమైన టిప్స్‌తో ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు.

కోడి గుడ్ల కంటే బాతు గుడ్లు పెద్దవిగా బరువు ఎక్కువగా ఉంటాయి.

కోడి గుడ్లతో పోలిస్తే బాతు గుడ్లకు మందమైన స్ట్రాంగ్‌ పెంకు ఉంటుంది

కోడి గుడ్లు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి

బాతు గుడ్లు తెలుపు, లేత ఆకుపచ్చ, బూడిద, గోధుమ రంగులో లేదా మచ్చలతో ఉండవచ్చు

బాతు గుడ్ల పచ్చసొనలు పెద్దవిగా ఉండి, ముదురు రంగులో కనిపించవచ్చు.

బాతు గుడ్లలో ఎక్కువ ప్రోటీన్, కొవ్వు, కేలరీలు కొలెస్ట్రాల్ ఉంటాయి.

కోడి గుడ్లతో పోలిస్తే బాతుగుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి