కూల్ గా ఉండటం ఎలా? పాజిటివ్ థింకింగ్ కోసం ఈ చిట్కాలు పాటించండి.

Published by: Shankar Dukanam

నెగటివ్, ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉంచుతాయి

ఎల్లప్పుడూ మనం మనకు నచ్చినట్లుగానే ఉంటూనే, బయటి సమాజంపై అవగాహనతో ఉండాలి

అనవసరమైన ప్రతికూల ఆలోచనలను వదిలిపెట్టాలి. దాని వల్లే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది

ఏదైనా చెడు జరుగుతుందనే ఆలోచనను మానుకోవాలి. ఎందుకు అలా జరిగిందో లాజిక్ తెలుసుకోవాలి

మీరు మంచిని స్వీకరించేందుకు, ఇతర అభిప్రాయాలు వినేందుకు సిద్ధంగా ఉండాలి

ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు. దాని వల్ల నవ్వులపాలవుతారు.

మీకు ఏం దొరికిందో దాంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి

గతం నుంచి నేర్చుకుని భవిష్యత్ గురించి ప్రయత్నాలు మొదలుపెట్టాలి. పాత విషయాల గురించి బాధపడొద్దు

ఏం జరిగినా నవ్వడం మర్చిపోవద్దు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి

మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే తప్పనిసరిగా నిపుణుడి సలహా తీసుకోవాలి.