మెంతి కూరను ఇంట్లో ఇలా పెంచేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

మేథీని ఇంట్లో పెంచడం చాలా సులభం. ఇది తక్కువ సమయంలో పెరిగే మంచి పంట.

Image Source: paxels

భారత వాతావరణం ప్రకారం చలికాలం మెంతి కూరను పెంచడానికి ఉత్తమ సమయం.

Image Source: paxels

ఈ సమయంలో ఉష్ణోగ్రత 10°C నుంచి 25°C వరకు ఉంటుంది. ఇది మెంతి కూర పెరగడానికి అనువైనదిగా పరిగణిస్తారు.

Image Source: paxels

నాణ్యత గల మెంతుల గింజలను కొనండి. తరువాత గింజలను ఏరి శుభ్రం చేసి ఆరోగ్యకరమైన గింజలను మాత్రమే ఉపయోగించాలి.

Image Source: paxels

మొలకెత్తడానికి విత్తనాలను 6 నుంచి 8 గంటలు నీటిలో నానబెట్టండి.

Image Source: paxels

మెంతికి బంకమట్టి లేదా ఇసుక నేలలు బాగా సరిపోతాయి. తరువాత నేలలో సేంద్రియ ఎరువులు కలపాలి.

Image Source: paxels

మట్టిని బాగా మెత్తగా చేయండి. తరువాత కుండీలో పెడుతుంటే.. 6 నుంచి 8 అంగుళాల లోతు ఉన్న కుండీని ఎంచుకోండి.

Image Source: paxels

కుండి కింద నీటి పారుదల కోసం రంధ్రాలు చేయండి. తరువాత కుండీలో తయారుచేసిన మట్టిని నింపి చదును చేయండి.

Image Source: paxels

విత్తనాలను నేల ఉపరితలంపై చల్లండి. తరువాత విత్తనాలను తేలికపాటి మట్టితో కప్పి నీరు చల్లండి. తరువాత 20 నుంచి 30 రోజులలో కోత కోయండి.

Image Source: paxels