బీపీని ఇంట్లో ఎలా చెక్ చేసుకోవాలి? ఆ తప్పులు చేయకండి

Published by: Geddam Vijaya Madhuri

మంచి నాణ్యత కలిగిన, వైద్యపరంగా ధృవీకరించబడిన డిజిటల్ బీపీ మానిటర్‌ను ఎంచుకోవడం మంచిది.

ప్రతిరోజూ ఒకే సమయంలో బీపీ చెక్ చేయండి. ఉదయం లేదా సాయంత్రం ఒకే సమయంలో కొలిస్తే రీడింగ్స్‌ను ఈజీగా పోల్చుకోవచ్చు.

కొలిచే ముందు 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ప్రశాంతంగా కూర్చొని శరీరాన్ని రిలాక్స్ చేసిన తర్వాత మాత్రమే బీపీ చెక్ చేయాలి.

కుర్చీలో నిటారుగా కూర్చోండి. వెన్నుకు సపోర్ట్ ఉండేలా కూర్చుని, రెండు పాదాలను నేలపై సరిగా ఉంచాలి.

చేతిని గుండె స్థాయిలో ఉంచండి. బీపీ కొలిచే చేతిని టేబుల్‌పై గుండె ఎత్తులో ఉంచడం వల్ల సరైన ఫలితాలు వస్తాయి.

కఫ్‌ను సరైన విధంగా కట్టండి. బీపీ మానిటర్ కఫ్‌ను మోచేతి పైభాగంలో బిగుతుగా కానీ అసౌకర్యం కలగకుండా ధరించాలి.

బీపీ కొలుస్తున్న సమయంలో మాట్లాడటం లేదా కదలడం వల్ల రీడింగ్స్ తప్పుగా రావచ్చు.

కాఫీ, టీ, సిగరెట్‌కు విరామం ఇవ్వండి. బీపీ చెక్ చేయడానికి కనీసం 30 నిమిషాల ముందు వీటికి దూరంగా ఉండాలి.

ఒక నిమిషం వ్యవధిలో రెండు సార్లు బీపీ కొలిచి సగటు విలువను నమోదు చేసుకోవడం మంచిది.

బీపీ రికార్డును ఒక డైరీ లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేసుకుంటే వైద్యుడికి అప్డేట్ చేస్తూ ఉంటే మంచిది.

అలాగే వైద్యుల సూచనలు ఫాలో అవుతూ.. మెడిసన్ రెగ్యులర్గా ఉపయోగించాలి.