భోజనం తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల గ్లూకోజ్‌ను కండరాలు ఉపయోగించుకుంటాయి. దీంతో బ్లడ్ షుగర్ స్పైక్స్ తగ్గవచ్చు.

తేలికగా నడవడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గించవచ్చు.

మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచవచ్చు.

తిన్న వెంటనే బద్ధకంగా అనిపించకుండా శరీరం మరింత చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.

అదనపు కేలరీలను ఖర్చు చేయడంలో సహాయపడటంతో బరువు పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న నడక కూడా రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

భోజనం తర్వాత వచ్చే కడుపు బరువు, గ్యాస్ వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

కొద్దిసేపు నడవడం ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం లేని వారికి ఇది సులభమైన ఆరోగ్యకరమైన అలవాటు.

వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది భోజనం తర్వాత 10 నిమిషాల నడిస్తే మంచిది.