కన్ను అదురుతోందా? కారణాలు ఇవే.. డాక్టర్‌ను ఎప్పుడు కలవాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కంటి కండరాలు అనియంత్రితంగా కదిలి కన్ను అదిరే అవకాశం ఉంటుంది.

తగినంత నిద్ర లేకపోతే కళ్లకు విశ్రాంతి దొరకదు. దీంతో కనురెప్పలు అదరడం సాధారణంగా కనిపిస్తుంది.

మొబైల్, ల్యాప్‌టాప్, టీవీని ఎక్కువసేపు చూడడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య రావచ్చు.

టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే కంటి కండరాల కదలికలు పెరిగే అవకాశం ఉంటుంది.

ఎక్కువసేపు చదవడం లేదా డ్రైవింగ్ చేయడం వల్ల కళ్లకు అలసట ఏర్పడి కనురెప్పలు అదరొచ్చు.

డ్రై ఐ సమస్య ఉన్నవారిలో కంటి చికాకు, కనురెప్పలు అదరడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

మెగ్నీషియం వంటి కొన్ని ఖనిజాల లోపం కూడా కండరాల కదలికలకు కారణం కావచ్చు.

కళ్లలో దురద, మంట, నీరు కారడం వంటి అలర్జీ లక్షణాలతో పాటు కన్ను అదరడం కూడా కనిపించవచ్చు.

కొన్ని ఔషధాల వల్ల అరుదుగా కనురెప్పలు అదరడం వంటి సమస్యలు రావచ్చు.

కన్ను అదరడం కొన్ని వారాల పాటు కొనసాగినా, ఎర్రదనం, వాపు, చూపు మసకబారితే వైద్యుడిని సంప్రదించాలి.