ఒక్క వారంలో బరువు తగ్గితే ఎంత ప్రమాదమో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఆహార నియంత్రణ నుంచి వ్యాయామం వరకు.. రెండూ బరువు తగ్గడానికి సమానంగా అవసరం.

Image Source: pexels

కానీ తక్కువ సమయంలో బరువు తగ్గించుకోవాలనే తొందరలో చాలా మంది ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటారు.

Image Source: pexels

అయితే ఒక్క వారంలో ఎంత బరువు తగ్గవచ్చు? ఎక్కువ బరువు తగ్గితే ఏమి జరుగుతుంది?

Image Source: pexels

ఒక వారంలో 0.5 కిలోగ్రాముల నుంచి 1.5 కిలోల బరువు తగ్గడమే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు.

Image Source: pexels

ప్రతిరోజు తీసుకునే ఆహారం నుంచి 500-1000 కేలరీలు తగ్గించగలిగితే.. ఒక వారంలో 1 కిలో వరకు బరువు తగ్గించుకోవచ్చట.

Image Source: pexels

అయితే దీనికంటే ఎక్కువ బరువు ఒక వారంలోనే తగ్గితే ప్రమాదంమని చెప్తున్నారు. దీనివల్ల శరీరంలో ఇతర సమస్యలు తలెత్తవచ్చట.

Image Source: pexels

ఒక వారంలోనే అధిక బరువు తగ్గడం శరీర కండరాలపై ప్రభావం చూపవచ్చు. శక్తి క్షీణించి.. అలసిపోవచ్చు.

Image Source: pexels

బరువు తగ్గినా, శరీర కండరాల బలాన్ని కాపాడుకోవడానికి.. అధిక ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవాలి.

Image Source: pexels

డైట్ నుంచి కార్బోహైడ్రేట్లు పూర్తిగా తొలగించండి. వ్యాయామం చేయండి. అప్పుడే బరువు తగ్గడం ఆరోగ్యంగా జరుగుతుంది.

Image Source: pexels