కొంత మందికి కాఫీ పడనిదే పొద్దున్నే బండి కదలదు. కానీ ఒక రోజులో ఎంత కెఫిన్ తీసుకోవచ్చో తెలుసా?

కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది కొద్ది మొత్తంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మోతాదు మించితే మాత్రం మంచిది కాదు.

కాఫీ నుంచి కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వరకు చాలా పదార్థాల్లో కెఫిన్ ఉంటుంది.

రోజూ ఎంత మొత్తంలో కెఫిన్ తీసుకుంటున్నామో, ఎంత వరకు తీసుకొవచ్చో తెలుసుకోవడం అవసరం.

చిన్న పిల్లల నుంచి టీనేజి వయసు వరకు పిల్లలు కెఫిన్ అసలు తీసుకోవద్దు.

ఒకవేళ తీసుకోవాల్సి వస్తే తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అది మోతాదుకు మించకుండా చూసుకోవడం తప్పనిసరి.

పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే కెఫిన్ ఉపయోగించాలి. ప్రతిరోజు 200 మి.గ్రా. మించకుండా తీసుకోవాలి.

పూర్తి ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు 400 మి.గ్రా. వరకు కెఫిన్ తీసుకోవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం కేవలం అవగాహన కోసమే.