గుడ్డు ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ.. చాలామంది దానిలోని పచ్చసొనను తినరు.

అయితే గుడ్డులోని పచ్చసొనను తినొచ్చు కానీ.. లిమిటెడ్​గా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.

వీటిలో విటమిన్ A, D, E, B12 ఉంటాయి. ఫోలేట్, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.

ఆరోగ్యంగా ఉండేవారు రోజుకు 1 లేదా 2 పచ్చసొనలు తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది.

ఎందుకంటే పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒక పచ్చసొనలో 186mg కొలెస్ట్రాల్ ఉంటుంది.

మీకు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉంటే వారానికి 3 నుంచి 4 పచ్చసొనలు మాత్రమే తీసుకోవచ్చు.

పచ్చసొన కంటే ఎగ్ వైట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యుల సూచనలు తీసుకోవాలి.

మధుమేహం, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ ఉండేవారు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.

ఫిట్​నెస్​ని రోజూ ఫాలో అయ్యేవారు రోజుకు 2 నుంచి 3 పచ్చసొనలు ప్రోటీన్​లో భాగంగా తీసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.